Income Tax: హైదరాబాద్లో రూ.40 కోట్ల భారీ ఐటీ కుంభకోణం
హైదరాబాద్లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఈ కుంభకోణంలో ట్యాక్స్ కన్సల్టెంట్స్తో పాటుగా రైల్వే, పోలీసు అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో విచారణను ప్రారంభించారు.
హైదరాబాద్(Hyderabad)లో భారీ ఐటీ(IT) కుంభకోణం వెలుగుచూసింది. రూ.40 కోట్ల ఆదాయపు శాఖ పన్ను రిఫండ్ కుంభకోణాన్ని అధికారులు బయటపెట్టారు. ఐటీ రిఫండ్(Income tax refund) పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపెట్టినట్లు ఐటీ సోదాల్లో తేలింది. ఈ కుంభకోణంలో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్ (Consultants)తో పాటుగా రైల్వే, పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీ(IT Companies)ల్లో అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఎల్బీనగర్, వనస్థలిపురం, నిజాంపేటలోని ఐటీ కన్సల్టెంట్స్లో అధికారులు సోదాలు చేయగా ఆయా కంపెనీలకు నోటీసులిచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 2017లో ఇలాంటి మోసాన్నే ఐటీ అధికారులు(IT Officers) గుర్తించారు. 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు(Software Employees) తమ కుటుంబీకుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రిఫండ్స్ క్లెయిమ్ చేసినట్లు గుర్తించారు. ఉద్యోగులకు అర్హతలు లేకున్నా కూడా కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్ల(Documents)తో మోసం చేసినట్లు తేలింది.