పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం పసిడి, వెండి ధరలు (Silver prices) గత కొన్ని రోజులుగా దిగి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ తాజాగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం(gold)తో పాటు వెండి ధరలు కూడా క్షీణించాయి. కొన్ని రోజుల క్రితం 10 గ్రాముల పసిడి ధర రూ.63,000 క్రాస్ చేసింది. ఇప్పుడు రూ.58,000 స్థాయికి దిగి వచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.58,080 వద్ద ఉంది.
రాయిటర్స్ (Rayitars) నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ, అమెరికా (America)ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్ (Bullion market) లో పది గ్రాముల బంగారం ధర రూ.59,050కి, కిలో వెండి ధర రూ.350 క్షీణించి రూ.71,250కి పడిపోయింది. గత ట్రేడింగ్ సెషన్ లో పది గ్రాముల పసిడి ధర రూ.59,350 వద్ద ముగిసింది. హైదరాబాద్ (Hyderabad) లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.58,750, 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.53,850గా ఉంది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 77, 700 మార్కు వద్ద కొనసాగుతుంది. ఇక ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా టాక్సులు బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని గమనించి కొనుగోలు చేయడం ఉత్తమం.