»Pieces Of Titan Were Found What Happened In The Seabed
Titan: ‘టైటాన్’ ముక్కలు దొరికాయి..సముద్ర గర్భంలో ఏం జరిగిందంటే
సముద్రంలోని టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే సబ్మెర్సిబుల్ అంతర్గత విస్ఫోటనం చెందింది. తాజాగా టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మానవ అవశేషాలను అధికారులు గుర్తించారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్(Titanic Ship) మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఓడను చూసేందుకు టైటాన్(titan) అనే సబ్మేర్సిబుల్(Submersible)లో వెళ్లి ఐదుగురు దుర్మరణం చెందారు. సముద్ర గర్భంలో ఒత్తిడి తట్టుకోలేక ఆ సబ్మేర్సిబుల్ పేలిలపోయి ఉంటుందని అందరూ అనుమానించారు. నిపుణులు చెప్పిన ఆ మాటే ఇప్పుడు నిజమైంది. నిర్మాణ తీరులో లోపాలు ఉండటం వల్ల, అలాగే సముద్ర గర్భంలోని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్ల ఆ సబ్మేర్సిబుల్ పేలిపోయినట్లు అధికారులు తెలిపారు.
సముద్రంలో ఆ సబ్మేర్సిబుల్(Submersible) జాడ కనిపెట్టేందుకు చాలా కష్టమైంది. అటు అమెరికా, ఫ్రాన్స్, ఇటు కెనెడా రష్యా బృందాలు సముద్రంలో జల్లెడ పట్టాయి. అయితే టైటానిక్ ఓడకు కాస్త అటు పక్కగా సముద్రం అట్టడుగున నేలపై టైటాన్(titan) సబ్మెర్సిబుల్ ముక్కలు కనిపించాయి. టైటాన్ శకలాలను గుర్తించిన అమెరికా తీర రక్షక దళం వాటిని ఎట్టకేలకు వెలికితీసింది.
‘టైటాన్’(Titan)లో అంతర్గత విస్ఫోటనం సంభవించి ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు నిర్దారణ అయ్యింది. ‘టైటాన్’ ప్రధాన భాగంలో ఉన్నటువంటి నిర్మాణం తీరులోని లోపాల వల్ల కూడా ఈ దారుణం జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం టైటాన్(Titan) సబ్మెర్సిబుల్(Submersible) శకలాలను ఒడ్డకు తీసుకొచ్చారు. వాటిలో ఉన్న మానవ అవశేషాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ దారుణ ఘటన వల్ల ఐదుగురు ధనవంతులు మరణించారు.