Road Accident: దారుణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కారు వేగంగా నడపడం వల్ల ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఆరుగురు దుర్మరణం(6 died) చెందిన ఘటన బాండా జిల్లాలో జరిగింది. వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు(Police) తెలిపారు. స్పాట్లోనే ఐదుగురు చనిపోయారని, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు(Injured) వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్య చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో(Community Health Centre) చికిత్స పొందుతూ దుర్మరణం చెందారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు(Police) వెల్లడించారు. వారిని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు బాండా డీఎం దుర్గాశక్తి నాగపాల్(DM durgashakti Nagpaul) తెలిపారు.
బండా ప్రాంతంలో అతివేగంగా కారు నడపడం వల్ల రోడ్డుపై వెళ్తున్న మరో వాహనం ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదం(Road Accident)లో ఇప్పటి వరకూ ఆరుగురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. కారులో మొత్తం 8 మంది ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.