»Shocking Aghora Puja On Deceased Body In Coimbatore Of Tamil Nadu
Aghora Pooja: స్నేహితుడి మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
తన స్నేహితుడు మరణవార్త విన్న ఓ అఘారా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బంధాలకు దూరంగా ఉండే అఘారా తన స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు.
స్నేహితుడి మృతదేహం(Deadbody)పై కూర్చుని ఓ అఘోరా పూజలు(Aghora Pooja) చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. మృతదేహంపై కూర్చుని అఘోరా పూజ చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అఘోరాను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించారు. తన స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలని అలా పూజ చేశానని ఆ అఘోరా చెప్పారు.
సలూర్ గ్రామంలోని కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్(Manikantan) అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. రెండేళ్లకు ముందు అతనికి వివాహం అయ్యింది. అయితే తన భార్యతో ప్రతి నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠన్ ఆదివారం విషం తాగి సూసైడ్(Suicide) చేసుకున్నాడు. తిరుచ్చికి చెందిన అతని చిన్ననాటి స్నేహితుడికి విషయం తెలిసింది.
బంధాలకు దూరంగా ఉంటూ అఘోరా(Aghora)గా ఉంటున్న అతను తన తోటి అఘోరాలతో కలిసి సలూర్ గ్రామానికి చేరుకున్నాడు. మణికంఠన్ మృతదేహంపై కూర్చుని చాలా సేపు పూజలు చేశాడు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మృతదేహంపై అఘోరా కూర్చుని పూజలు(Aghora Pooja) చేయడం అక్కడున్న వారికి భయాందోళనను కలిగించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి.