హైదరాబాద్(Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఎల్బీ నగర్(Lb Nagar)లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కార్ల షోరూమ్(Car Showroom) సమీపంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పక్కనే ఉన్న కార్ల షోరూమ్‌కు చేరాయి. కార్ మెన్ కార్ అనే గ్యారేజ్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకోగా కార్ల నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 కార్లకు పైగా తగలబడ్డట్టు సమాచారం. కార్ల షోరూమ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలివచ్చి మంటలార్పుతున్నారు. భారీ శబ్దాలతో కార్లు తగలబడుతుండటంతో చుట్టుపక్కల నివశిస్తున్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.