అక్క అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవం అయి కనిపించింది. అదే రోజు చెల్లెలు తన ప్రియుడితో పారిపోయింది. మరోవైపు ఇంట్లో వోడ్కా, బ్రీజర్, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆగస్మాత్తుగా జరిగిన పేలుడులో 8 మంది మరణించారు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దత్తాపుకూరులో చోటుచేసుకుంది.
అక్రమ డ్రగ్స్ దందాను అపాల్సిన పోలీస్ అధికారి ఏకంగా తానే అక్రమాలకు పాల్పడ్డాడు. ఓ డ్రగ్స్ కేసు(drugs case)లో దొరికిన మాదక ద్రవ్యాలను కోర్టుకు సమర్పించకుండా ఇంట్లో దాచుకున్నాడు. తర్వాత విషయం తెలిసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారవేత్త కన్నుమూశారు. ఈ ప్రమాదం హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని నూహ్‌లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టి తుక్కు తుక్కైంది.
హైదరాబాదీ ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు శిక్షను విధించినట్లు ఎన్ఐఏ కోర్టు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరిని 2019లో అరెస్ట్ చేయగా ఇప్పటికీ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
మధురై(Madurai) రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు(Fire Accident ) చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల కుంభకణంలో కేసులో ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. వైద్యం చేయకుండానే చేసినట్లు, మందులు కొనకుండానే ఫేక్ బిల్లులు సృష్టించి వందల కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదైంది.
ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.
భార్యభర్తల గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి లేదా కోర్టులో చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తి బార్ వద్ద చూపించాడు. అది తన వైఫ్‌పైన కాదు. ఆమె మీద కోపంతో సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.