misdemeanors-of-guntur-nallapadu-constable-wife-caught-police-red-handed
Viral News: విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టే పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు అవినీతి పరులు, కామంధులు కూడా ఉన్నారు. వారు చేసే కొన్ని పనుల వలన పోలీసు(Police) వ్యవస్థకే చెడ్డపేరు వచ్చేలా ఉంది. పలువురు అవినీతి చేస్తూ డిపార్ట్మెంట్కు మచ్చ తీసుకొస్తుంటే.. మరికొందరు స్త్రీలోలుగా మారి వ్యవస్థ పరువు తీస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆపదలో ఉన్న ప్రజలకు పోలీసులు గుర్తుకు రావాల్సింది పోయి.. పోలీసులతో ఏ ఆపద వస్తుందోననే భయం ప్రజల్లో మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు(Guntur) జిల్లాలో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అక్కడి ప్రజలు ఛీ అంటున్నారు.
చదవండి:Ayodhya: అయోధ్య ఆలయంలో పూజారి గొంతు కోసి కిరాతకం..పరారీలో శిష్యులు!
జిల్లాలోని నల్లపాడు(Nallapadu) పోలీస్ స్టేషన్లో కత్తి శ్రీను అనే కానిస్టేబుల్(Constable) మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న భార్య అతన్ని వారించింది. అయినా అతను వినలేదు. చేసేది ఏం లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. డిపార్టులో పనిచేస్తుండంతో సదరు పోలీసులు వ్యక్తిగతంగా మందలిస్తామని భార్యకు సంజాయిషీ ఇచ్చారు. అయినా అతను మారలేదు. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా ఆమె రెడ్ హ్యండెడ్‌గా అతన్ని పట్టుకుని పోలీసులకు పట్టించింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. తనకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఘటనే ఆ మధ్య హైదరాబాద్‌లో కూడా చోటు చేసుకుంది. గౌరవమైన పోలీస్ వ్యవస్థలో ఉండి ఇలా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు.
చదవండి:Dream11లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్ఐ.. తర్వాత ఏమైందంటే?

