»What Happened To Si Who Won Rs 1 5 Crore In Dream11
Dream11లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్ఐ.. తర్వాత ఏమైందంటే?
ఆన్లైన్లో బెట్టింగ్‌లు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి. మ్యాచ్‌ల టైమ్ అంటే ఇంకా ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఓ ఎస్సై బెట్టింగ్ ద్వారా కోటిన్నర గెలుచుకుని సస్పెన్షన్‌కు గురయ్యాడు.
Dream11: ప్రస్తుతం ఆన్లైన్లో బెట్టింగ్ యాప్‌లు జోరుగా సాగుతున్నాయి. అందులోనూ ఇది వన్డే ప్రపంచ కప్ సమయం. చాలామంది వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటూ డ్రీమ్ 11 ఆడుతుంటారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కొందరు డబ్బు పొగొట్టుకుంటే మరికొందరు మనీ సంపాదిస్తుంటారు. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఎస్సై సోమనాథ్ పోలీసు నిబంధనలను అతిక్రమించి గత మూడు నెలలుగా డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఈనేపథ్యంలో అక్టోబర్ 10న జరిగిన ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతో టీమ్‌ను ఎంచుకున్నాడు. వెంటనే రూ.కోటిన్నర గెలుచుకున్నట్లు మెసేజ్ వచ్చింది. మొదట నమ్మలేదు. తర్వాత నమ్మిన సోమనాథ్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడకూడదని చెప్పాల్సిన పోలీసులే బెట్టింగ్‌కు పాల్పడటం వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన పోలీసు శాఖ విచారణ చేసి ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.