»10 Kg Gold Stolen From Manappuram Goldloan Branch In Kankipadu Krishna District
Gold stolen: 10 కిలోల గోల్డ్ చోరీ చేసిన యువతి..అందుకోసమేనా?
దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
10 kg gold stolen from Manappuram Goldloan branch in Kankipadu, Krishna district
Gold stolen: ప్రముఖ గోల్డ్ లోన్ సంస్థ మణప్పురం(Manappuram) బ్రాంచ్‌లో భారీ చోరీ జరిగింది. కృష్ణా జిల్లా(Krishna district) కంకిపాడు(Kankipadu)లోని బ్రాంచ్ కార్యాలయంలో రూ.6 కోట్ల విలువ చేసే 10.660 కేజీల బంగారం అపహరణకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరో కాదు బ్రాంచ్‌లో పనిచేసే పావని అనే ఉద్యోగినే. తనతోపాటు మరో వ్యక్తిని కలుపుకుని ఆ సొమ్మును దొంగలించింది. విషయం తెలుసుకున్న బ్యాంకు ఉద్యోగులు ఉన్నతాధికారులు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారులు వచ్చి ఖాతాదారుల రికార్డులు పరిశీలించి నివేదిక తయారు చేశారు. బ్రాంచిలో మొత్తం 1477 మంది ఖాతాదారులు ఉన్నారు. కంకిపాడు బ్రాంచ్‌లో 16కేజీల బంగారం తాకట్టులో ఉంది. ఇందులో 10.660 కేజీల బంగారం పావని తీసుకెళ్లినట్టు వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలు పావని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ పథకం వేస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పారు. తీసుకెళ్లిన బంగారం ఎక్కడుంది. ఎవరికైనా అమ్మారా? అనే విషయాలు తెలియాలంటే పావని దొరకాలని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బయటకు తెలియడంతో కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు. వారి బంగారానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కస్టమర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ అధికారులు భరోసానిచ్చారు. దాంతో కస్టమర్ల ఊపిరి పీల్చుకున్నారు.