కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉద్యోగం, వ్యాపారం, స్టాక్ మార్కెట్లో షేర్లు అంటూ అమాయకులను మోసం చేశాడు సైబర్ మోసగాడు రోనాక్ భరత్. అలా రూ.500 కోట్లు వసూల్ చేసిన విషయం సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది.
జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫేక్ బాబాల డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక పేరుతో.. మారుమూల ప్రాంతంలో వెలుస్తున్నారు. అమాయకులను నమ్మించి.. లక్షల్లో దండుకుంటున్నారు. విజయవాడలో ఓ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రిటైర్మెంట్ డాక్టర్ ఇంట్లో హత్య జరిగింది. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయమే ఈ హత్యకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. యజమానికి భయపడే హత్య చేసినట్లు నిందితురాలు కూడా ఒప్పుకోవడం విశేషం.
అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా రూ.9 లక్షలు టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. పోలీసులను సంప్రదించాడు.