భార్యతో గొడవపడి బిడ్డని చంపేశాడో దుర్గార్గుడు. ముక్కుపచ్చలారని చిన్నారి(little girl)ని అమానుషంగా హత్య చేశాడు.భార్యపై కోపంతో కూతురిని చంపేశాడు. హైద్రాబాద్లో (Hyderabad) దారుణం జరిగింది. నగరవాసి చంద్రశేఖర్ హిమతో 12ఏళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం అతడి ఉద్యోగం పోగా.. విబేధాలు రావడంతో భార్య కూతురు మోక్షిజ (Mokshija) (8)ను తీసుకుని పుట్టింటికెళ్లింది. ఈ కోపంతో స్కూల్లో ఉన్న కూతురికి మాయమాటలు చెప్పిన తండ్రి తనతో తీసుకెళ్లాడు. చందానగర్ (Chandanagar) గొంతుకోసి హత్య చేశాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ORR వైపు వెళ్లి.. చివరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు దొరికిపోయాడు.
ఉద్యోగం కోల్పోయిన తర్వాత తనను భార్య, అత్తమాలు తక్కువ చేసి చూస్తున్నారని భావించాడు. తన ఉద్యోగం (Job) పోయిందని.. భార్య మాత్రం సంతోషంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటోందని అసహనానికి లోనయ్యాడు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మోక్షజ చదువుతున్న పాఠశాలకు చంద్రశేఖర్ వెళ్లాడు. ఎప్పటిలాగా పాపను కారులో తీసుకొని బయటకు వెళ్లారు. కాస్త దూరం వెళ్లిన తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్లేడ్(blade)తో మోక్షజను గొంతు కోసి చంపేశాడు. పాప మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని కుట్ర పన్నిన చంద్రశేఖర్.. అబ్దుల్లాపూర్మెట్ (Abdullahpurmet) పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ ఎటు వెళ్లాలి.. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలనే ఆలోచనతో కారు నడుపుతూ అదుపుతప్పి పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది
అదే సమయంలో అటువైపు గస్తీలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గుర్తించి అటువైపు వెళ్లి కారు వెనక సీట్లో పాప మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే నిందితుడినిను అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రశ్నించడంతో.. తన భార్య ఆనందాన్ని దూరం చేసేందుకే కుమార్తెను హత్య చేసినట్లు చంద్రశేఖర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. పాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీ(Mortuary)కి తరలించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.