తెలంగాణ (Telangana)లో భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. మణుగూరు (Manuguru)లో శనివారం సాయంత్రం భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రెండు సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించింది. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. జమ్మూకశ్మీర్లో కూడా నిన్న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.