ఈ మధ్య కాలంలో యువతులకు సోషల్ మీడియా (Social media) వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రాం, ట్విట్టర్ ఇలా వేరు వేరు సోషల్ మీడియా పరిచయమై.. ఆ తర్వాత అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ (Blackmail) కు దారితీస్తోంది. ఇన్‌స్టాలో తనను ఫాలో కావాలని బెదిరించడు ఓ యువకుడు ఈ ఘటన హైద్రాబాద్‌లో జవహర్ నగర్‌కు చెందిన ఓ బాలిక గతనెల 23న బస్తీలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ముఖానికి మాస్క్ ధరించిన ఓ గుర్తు తెలియని యువకుడు బాలికను అడ్డగించాడు. ఆమె ఫొటోలు తన ఫోన్లో ఉన్నాయంటూ.. తన ఫోన్లోని ఫొటోలు చూపించాడు. ఇన్స్టాగ్రామ్(Instagram)లో తనను ఫాలో కావాలని బెదిరించాడు.
ప్రతిరోజు తనతో మాట్లాడాలని సూచించాడు. తనతో మాట్లాడకున్నా.. ఇన్‌స్టాలో ఫాలో కాకపోయినా.. వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తానని హెచ్చరించాడు. ఇంట్లో వారికి చెబిబే చంపేస్తానని అన్నాడు. భయబ్రాంతులకు గురైన బాలిక తనను వేధింపులకు గురి చేయవద్దని పలుమార్లు వేడుకుంది. అయినప్పటికీ మళ్లీ ఈనెల 16న బాలిక(Girl)ను రోడ్డుపై ఆపి.. ఆమె చేతిపై ఇన్స్టాగ్రామ్ ఐడీ రాశాడు. ఫాలో కాకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. బాలిక తన కుటుంబీకులకు విషయం చెప్పింది. మధురానగర్ (Maduranagar) పోలీసులకు గుర్తు తెలియని యువకుడి వేధింపులపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.