AP: ఏపీలో వాహనాల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీలు) జారీని నిలిపేస్తూ రవాణాశాఖ (RTA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసయినా కార్డుల జారీ ఉండదు. యాప్‌లో (AAPS) ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ చూసుకోవాల్సిందే. రవాణాశాఖ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా వీటి కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది వాహన దారులకు క్లారిటీ వచ్చింది. రోడ్లపై పోలీసులు, రవాణా సిబ్బంది వాహనాలు ఆపిన సమయంలో డౌన్ లోడ్ చేసుకున్న లేదంటే యాప్‌లలో (AAPS) కనిపించే పత్రాలు చూపిస్తే సరిపోతుంది.
ఇప్పటికే లక్షలాది మంది వాహనదారుల వద్ద లైసెన్స్ కార్డు లేదంటే ఆర్సీ కార్డు (RC CARD) జారీకి రూ.200తోపాటు పోస్టల్ ఛార్జీ రూ.25 కలిపి మొత్తం రూ.225 వసూలు చేస్తోంది. గత కొంతకాలంగా వీటిని వసూలు చేయడం ఆపేశారు. అలా ఛార్జీలు వసూల్ చేసిన వాహనదారులకు కార్డులను త్వరలో జారీ చేస్తామని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు. మిగతా వారు మాత్రం కార్డులను యాప్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. రవాణాశాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం వాహన్ పరివార్ వెబ్ సైట్లో చేర్చింది. దీంతో రాష్ట్రాల రవాణాశాఖ వెబ్ సైట్లలో సమాచారం అందుబాటులో లేదు. గతంలో మాదిరిగా కార్డుల డౌన్ లోడ్ వంటి ఆప్షన్లను తీసేశారు. ఇప్పుడు మరోసారి వెబ్ సైట్లలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. సో.. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఆన్ లైన్ చేశాయి.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో యాప్‌లలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే సరిపోతుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన యాప్‌లలో ఆర్సీ ఉంటుంది. ట్రాఫిక్/ సివిల్ పోలీసులు తనిఖీ చేసిన సమయంలో డౌన్ లోడ్ చేసిన సర్టిఫికెట్ లేదంటే యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది.