సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇండియాలో భారీ ఎండలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు గత మూడు రోజుల్లో 98 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణను హత్య చేసిన దుండగులు సుపారి గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసినట్లు సమాచారం ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు భూవివాదంలో రామకృష్ణను హత్య చేసినట్లు సమాచారం మూడు రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణ
పదో తరగతి విద్యార్థి అమర్ నాథ్ హత్యలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టంచేశారు. మృతుడు, నిందితుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు.
బ్రెజిల్(Brazil)లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్‌లో భారీ వరదల కారణంగా ముగ్గరు మృత్యువాత చెందగా..మరో 12 మంది తప్పిపోయినట్లు బ్రెజిలియన్ మీడియా పేర్కొంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి గూడ్స్ ఆటో కారు ఢీ, నలుగురు మృతి ఆలమూరు మండలం మడికిలో ఘటన 9 మందికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు మరింత సమాచారం తెలియాల్సి ఉంది
మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడం కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలతో ఓ వ్యక్తి వ్యాపారం చేశాడు. శరీర భాగాలను అమ్ముతూ జేబును నింపుకునేవాడు. తాజాగా అతని వ్యాపారం బయటపడింది.