రాను రాను కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదు. ఏం చేసిన హైలెట్ కావాలని చూస్తున్నారు.ప్రజలు వారి గురించే చర్చించుకోవాలని తపన పడుతున్నారు. రాజస్ధాన్(Rajasthan)లోని హనుమన్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు రాంగ్ సైడ్‌లో వచ్చింది. ఇంతలో ఓ యువతి (young woman) ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కారు యువతి పైకి వెళ్లగా ఆమె రక్షణగా బానెట్(Bonnet)ను పట్టుకుంది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. ఇది చూసి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. అయినా డ్రైవరు కారు(Car driver)ను ఆపలేదు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారును గుర్తించామని జంక్షన్ స్టేషన్ ఇంఛార్జ్ విష్ణు ఖత్రి (Vishnu Khatri) తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. బాధిత మహిళ, కారుడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన విషయంలో రాజకీయ నేతలు స్పందించారు. ఈ వీడియోను మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (Rajyavardhan Singh) తన ట్విట్టర్ అకౌంట్లో (Col Rajyavardhan Rathore) షేర్ చేశారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘఢ్‌లో పట్టపగలు ఓ మహిళను కారు బానెట్‌పై దుండగులు లాక్కెళ్తున్నారు. గెహ్లాట్ జీ, మీ పరిపాలనలో మహిళలపై ప్రతిరోజు ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్న విషయం మీకు తెలుస్తోందా? అనే శీర్షికతో పోస్టు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (video viral)అవుతోంది.
सत्ता के संरक्षण में बदमाशों ने थामी अपराध की स्टेयरिंग !
राजस्थान के हनुमानगढ़ में दिनदहाड़े बदमाश कार के बोनट पर एक महिला को घसीट रहे हैं। गहलोत जी, रोज़ाना सरेआम जब ऐसी वारदात महिलाओं के साथ हो रही हैं तो क्या आपको अंदाज़ा भी है कि पूरे राजस्थान में आपके कुशासन में महिलाओं का… pic.twitter.com/ZvoyTRPuiI