సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక ఇటీవల వారం రోజుల క్రితమే క్యాంపస్‌కి వచ్చినట్లు తెలిసింది. అయితే వంశిక బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. బైక్‌ను తప్పించబోయి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్సర వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ చెబుతున్నారు. కుమారుడు చనిపోయినప్పటీ నుంచి అప్సర, ఆమె తల్లి జాడ తెలియలేదని పేర్కొన్నారు.
విజయవాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు బీభత్సం సృష్టించాడు. కారుతో బైక్‌ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓ చోట ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే రాజమండ్రి నుంచి విజయవాడ వైపు కారు వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉండగా, ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధి...
భూషణ్ స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను అరెస్టు చేశారు. 56,000 కోట్ల బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీరజ్ సింఘాల్‌ను అరెస్టు చేసింది.