Female Foeticide: ఘోరం..ఈ జిల్లాల్లో వెయ్యి మంది అబ్బాయిలకు 891 మందే అమ్మాయిలు
అభివృద్ధిలో పురోగతి సాధించామని చెప్పుకుంటూనే ఇంకా పాశవిక సంస్కృతిలో బతుకుతున్నాము. ఇప్పటికీ ఆడబిడ్డ పుట్టడం అరిస్టంగా భావించే ఉద్దండులు కూడా ఉన్నారు. కళ్లు తెరవకముందే పసికూనలను చిదిమేసే పాపాత్ములు ఉన్నారు. ఫలితంగా ఆడ శిశువులు నిష్పత్తి తెలంగాణలో ఘననీయంగా తగ్గింది. దీనిపై అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Female Foeticide: ఆడ, మగ(female male) సమానం అని ఎన్ని సార్లు, ఎంత మంది చెప్పినా ఇంకా సమాజం కళ్లు తెరవడం లేదు. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ, మగబిడ్డానా అని తెలుసుకుంటున్నారు. ఆడశిశువని తెలిస్తే అన్యాయంగా తల్లికడుపులోనే సమాధికట్టేస్తున్నారు(Feticide). లింగ నిర్ధారణ చేయడం కఠినమైన నేరమైని ఎన్ని ప్రచారాలు చేసినా సరే కాసుల ఆశచూపి, కక్కుర్తి వైద్యుల సాయంతో తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా ఈ ఆగడాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) మహానగరం సహా జిల్లా, మండల స్థాయిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్(Nursing home)లు నిర్ధారణ పరీక్షలకు అడ్డగా మారాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణాలో ప్రతి 1000 మంది మగ శిశువులకు, 927 మంది మాత్రమే ఆడ శిశువులున్నారు. 2017లో ఆ సంఖ్య 932గా ఉండేది. ఆరేళ్లలో వారి సంఖ్య పెరగాల్సిన ఆ నిష్పత్తి తగ్గుతుండడం చూసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
తాజా లెక్కల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli)లో పత్రి వెయ్యి మంది మగపిల్లలకు 891 మంది ఆడపిల్లలు ఉన్నారు. వరంగల్ జిల్లా(Warangal District)లో కూడా 891 మంది, యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో 885 మంది ఆడబిడ్డలు ఉన్నారు. అలాగే నల్గొండ 881 మంది, మహబూబాబాద్ లో 863 మంది, కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో 862, మేడ్చల్ మల్కాజిగిరి 859, అత్యంత తక్కువగా 856 మంది ఆడబిడ్డలు జనగామ జిల్లాల్లో ఉన్నట్లు పేర్కొంది. దీనిపై రాష్ట్ర కుటుంబ ఆరోగ్యశాఖ విచారణ వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారం నడుపుతున్న ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలను కట్టడి చేసినా.. నిష్పత్తి ఇలా ఉండడం, ఇన్ని జిల్లాలలో 900 కంటే తక్కువగా నమోదవడం నిజంగా వారిని బాధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి కారణం ఈ జిల్లాల్లో గర్భస్థ ఆడ శిశువులను పిండదశలోనే విచ్ఛిన్నం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన వైద్యశాఖ గత నెలలో ఆదేశాలను జారీ చేసింది. ఈ జిల్లాల్లో అబార్షన్ల(Abortions)పై నిఘా పెట్టాలని, ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని ఆదేశించింది. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించి, కేసులు కూడా నమోదు చేశారు. సంబంధిత నివేదికలను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇక్కడ రాజకీయ, అధికారం, డబ్బు పలుకుబడి ఉన్న కొంతమంది మూలంగా ఈ చర్యలు వేగంగా, సజావుగా సాగడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే జమ్మికుంటలోని మూడు నర్సింగ్ హోమ్‌లపై రైడ్ చేసిన అధికారులు వాటిని సీజ్ చేశారు. అలాగే సూర్యాపేట జిల్లాలో తనిఖీలు చేసి 94 ప్రైవేటు ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేశారు. 50 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపైనా నిఘా పెట్టారు. రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న వైద్యులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా కాసులకు కక్కుర్తిపడి శిశులను చిదేమేస్తున్న రక్షసులకు మద్ధతుగా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి పని చేసిన అధికారులను మొచ్చుకోవల్సింది పోయి, చూసిచూడనట్లు వదిలేయండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. లేదంటే అధికారబలంతో బెదిరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ రెషియో మరింతంగా క్షిణిస్తుందని పలు అధ్యాయాలు అంచనాలు వేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని క్షేత్ర స్థాయిలో కట్టడి చేయాల్సిందిగా పలు ఎన్జీవోలు భావిస్తున్నాయి.