గోల్డ్ స్కీమ్ పేరుతో మహిళల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి చివరగా తమ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
బ్రిజ్భూషణ్పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.
అప్సర హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. అప్సరకు ముందే వివాహం అయినట్లు విచారణలో తేలింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉండగా సాయికృష్ణతో ప్రేమలో పడింది. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కరువౌతోంది. రోజు రోజుకీ బాలికలు, మహిళలపపై అత్యాచారాలు ఎక్కువౌతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఓ అమాయక బాలికను ఓ సింగర్ దారుణంగా మోసం చేశాడు. కాగా, అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల 2200 పత్తి బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
సమాజంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన చంపాడాలు...చావాడాలే కనిపిస్తున్నాయి. ఇదే కోవకు చెందిని ఓ ఘటన తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుని అఖరికి అతని చేతిలోనే హత్యకు గురైంది.
కెనడాలో కార్చిచ్చు పొగ అగ్రరాజ్యం అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. న్యూయార్క్ ఎయిర్ క్వాలిటీ 500 ఏక్యూఐ నమోదైంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు విధింగా మాస్క్ ధరించాలని అమెరికా వాతావరణ శాఖ స్పష్టంచేసింది.