హీరోయిన్ డింపుల్ హయతి తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయి చనిపోయారు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
బాలాసోర్ రైలు ప్రమాదంలో సిబిఐ తనతో స్టేషన్ మాస్టర్ మొహంతీని విచారణ కోసం తీసుకువెళ్ళింది. సీబీఐ ఎక్కడ ప్రశ్నిస్తోందో ఎవరికీ తెలియదు. బహ నాగా రైల్వే స్టేషన్ పూర్తిగా స్టేషన్ మాస్టర్ మొహంతి కంట్రోల్ రూమ్ నుండి నిర్వహించబడింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడితో కలిసి కూతురు తండ్రిని పదునైన ఆయుధంతో హతమార్చింది. హత్య సమయంలో ఇంట్లో ఉన్న సోదరుడిని కూడా చంపేందుకు సోదరి ప్రయత్నించింది. ఎలాగోలా సోదరుడు తన ప్రాణాలను కాపాడుకుని ఇంటి నుంచి తప్పించుకున్నాడు.
అమెరికా(America) వర్జీనియా(virginia)లోని రిచ్‌మండ్‌లోని హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పుల(firing) ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.