ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాలంటీర్ ఏకంగా ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే లక్షా 70 వేల రూపాయలను తీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు తెలిపింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్లను కొట్టేసి ఐఎంఈఐ(IMEI) నెంబర్లు మార్చే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొత్తవాటిని అమ్మి సొమ్ముచేసుకునే ఈ గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి దగ్గర ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.
మద్యం తాగిన మత్తులో కారును నడిపి రోడ్డుమీద హల్చల్ చేసిన యువకులు. స్పీడ్‌గా దూసుకొచ్చిన కారుతో చెట్టును ఢీ కొట్టారు. ఆ తరువాత అదపుతప్పి అటుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
14 ఏళ్ల కుమార్తెను కేవలం 25 వేల రూపాయలకే కన్న తల్లి అమ్మెసింది. ఆ క్రమంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఓ వ్యక్తితో పెళ్లి చేస్తుండగా..ఆ యువతి స్థానిక నేతలకు చెప్పి..ఎలాగోలా బయటపడింది. అంతేకాదు వరుడికి ఇది రెండో వివాహం కావడం విశేషం.
ఓ టూవీలర్‌ను తప్పించే ప్రయత్నంలో కంటైనర్ బోల్తా పడింది. హారన్ కొట్టినప్పటికీ టూ వీలర్ రైట్ వైపునకు రాగా.. కంటైనర్ డివైడర్ మీదకు తీసుకెళ్లాడు డ్రైవర్ రషీద్. దీంతో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న యువతిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు ప్రేమ, వ్యవహారం నడిపించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. చివరకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో నీళ్ల ట్యాంక్ కింద తోసేశాడు. అది ప్రమాదవశాత్తు అని నమ్మంచే ప్రయత్నం చేశాడు.. కానీ చివరకి ఏమైందంటై..
పైన అంతా చీకటి, చేజారితే కింద గోదావరిలో పడిపోవడం ఖాయం. కానీ ఓ చిన్నారి ఒక పైపును పట్టుకొని 6 గంటలు తీవ్రంగా శ్రమించింది. ఎంత అరిచినా ఎవరు లేరు. తన తెలివితేటలను ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది.
తాగిన మత్తులో ఓ వ్యక్తి దారణానికి ఒడిగట్టాడు. తానే శివుడినని..తిరిగి బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హతమార్చాడు. ఈ సంఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీశారు. అయితే అతను ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చుద్దాం.