Adam Britton: 42 కుక్కలపై అత్యాచారం..అతడొక శాడిస్ట్ శాస్త్రవేత్త!
ఓ జంతు శాస్త్రవేత్త దారుణానికి ఒడిగట్టాడు. కుక్కలను అత్యాచారం చేసి వాటిని వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. అతని వీడియోలు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడికి డిసెంబర్లో శిక్ష ఖరారు కానుంది.
ఓ జంతు శాస్త్రవేత్త కుక్కల పట్ల దారుణానికి ఒడిగట్టాడు. పదుల సంఖ్యలో కుక్కలపై అత్యాచారం చేసి వాటిని క్రూరంగా హింసించాడు. ఆ కుక్కలను హింసించి, దారుణంగా చంపి వీడియోలు తీశాడు. ఈ దారుణ ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..ఆడమ్ బ్రిటన్ అనే వ్యక్తి బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్లతో కలిసి పనిచేసిన జంతు శాస్త్రవేత్త. ఆయనపై డజన్లకొద్దీ కుక్కలను చంపినట్లు ఆస్ట్రేలియా కోర్టుకు ఫిర్యాదు అందింది.
ఈ కేసును విచారించే సమయంలో నార్తర్న్ టెరిటరీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అక్కడున్నవారినందరినీ బయటకు వెళ్లమని చెప్పాడు. ఘోరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తి చేసిన పనులు తెలిస్తే అక్కడున్నవారు షాక్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కోర్టు గది నుంచి బయటకు వెళ్లమని హెచ్చరించాడు. ఆడమ్ బ్రిటన్కు 2014 నుంచి జంతువులపై శాడిస్ట్ లైంగిక ఆసక్తి ఉందని, తన ప్రాంతంలోని సుమారు 42 కుక్కలపై అత్యాచారం చేసి చంపేసినట్లుగా కోర్టు ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు.
ఓ కంటైనర్లో కుక్కలను అత్యాచారం చేసి, హింసిస్తూ వీడియోలు తీసేవాడని కోర్టులో రుజువైంది. ఆయన వీడియోలు కూడా బయటకు రావడంతో కోర్టు ఈ కేసును సీరియస్గా తీసుకుంది. పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభ్యం కావడంతో బ్రిటన్ న్యాయస్థానం నిందితుడికి డిసెంబర్ నెలలో శిక్షను ఖరారు చేయనుంది.