»Up Teen Wanted To Make Reel With Train In Background Hit By It
Viral News: యువకుడి ప్రాణం తీసిన రీల్స్ మోజు
పిల్లల నుంచి పెద్దల వరకు చేతులో మొబైల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు తీసుకుంటారు లేదా రీల్స్ చేస్తుంటారు. అదేదో ఉల్లాసంగా చేస్తే బాగుంటుంది. కానీ ఉద్యమంలా చేస్తారు కొందరు. అలా రీల్స్ కోసం మరికొందరు దారుణమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా మరొకటి చోటుచేసుకుంది.
UP Teen Wanted To Make Reel With Train In Background, Hit By It
Viral News: చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ (SmartPhone) వచ్చిన తరువాత కొంత మంది చేస్తున్న అనేక పనులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నిజ జీవితంపై సెల్ ఫోన్ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఉదయం నిద్రలేచింది మొదలు పడుకునే చివరి నిమిషం వరకు చరవాణి(Mobile)ని మనతోనే అంటిపెట్టుకుని ఉంటున్నాము. దీని ద్వారా శారీరకంగా మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నాము. ఇదే విషయంపై ఎందరో నిపుణులు హెచ్చరిస్తున్నా కూడా మనం ఈ అలవాటును మార్చుకోలేకపోతున్నాము. దీనికి తోడు కొందరికీ సెల్ఫీలు(Selfie), రీల్స్(Reels) చేయడం అంటే పిచ్చి. అందరిలో వినుత్నంగా కనిపించాలని ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టెస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది సెల్ఫీల పేరితో రీల్స్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రాణాలను వదులుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్(UtharaPradesh)లోని బారాబంకిలో చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్(Instagram) రీల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ 16 ఏళ్ల ఫర్హాన్ అనే బాలుడు మృత్యువాత చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తన స్నేహితుడి మొబైల్లో రికార్డు కావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో రైలు వెళుతుండగా ఆ బాధిత యువకుడు రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఈ దృష్యాలను ఫర్హాన్ స్నేహితుడు తన మొబైల్లో షూట్ చేస్తున్నాడు. ఆ క్రమంలో వేగంగా వెళ్తున్న రైలు గాలికి వెనక్కి తూలాడు ఫర్హాన్. దీంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాడు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించి దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా ఈ ఏడాదిలోనే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని ఒక కళాశాలలో 20 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం చిత్రీకరిస్తుండగా కిందపడి మరణించాడు. బిల్డింగ్ పైన కిటికి నుంచి మరో కిటికిపైకి దూకుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.
అదేవిధంగా జూలైలో కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరిస్తున్నప్పుడు ఒక వ్యక్తి జలపాతంలో కొట్టుకుపోయాడు. కొల్లూరు గ్రామానికి 6 కి.మీ దూరంలో ఉన్న అరసినగుండి జలపాతం వద్ద జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి స్నేహితుడు తన కెమెరాలో రికార్డు చేశాడు. ఇలాంటివి ఎన్నో ఘటనలు వెలుగులోకి రానివి కూడా ఉన్నాయి. అందుకే రీల్స్ చేసేవారు రిస్క్ తీసుకోకుండా సరదాగా చేస్తే బాగుంటుంది. అంతే కానీ ఇలా ప్రాణాలను పణంగా పెట్టి కాదనే విషయాన్ని పిల్లలకు తల్లిదండ్రులు చేప్పాలని నిపుణులు చెప్తున్నారు.
tw // disturbing
Barabanki: A teenager Farmaan (14) who was purportedly making a video for Instagram reels along the railway tracks was kiIIed when he was struck by a running train. pic.twitter.com/Ysxl895ABD