ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బూరుగుపూడి గేటు సమీపంలో కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే స్నేహితులంతా కలిసి మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులు ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ గా గుర్తించారు. వీరు ఏలూరు శ్రీరామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా తె...
మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోలీసులు కఠిన శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా 8వ తరగతి చదివే విద్యార్థినిని పీఈటీ టీచర్ లైంగికంగా వేధించాడు. తల్లిదండ్రులు స్కూల్‌పై దాడి చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో డేట్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి రెస్టారెంట్ బిల్ విషయంలో వివాదం తలెత్తతింది. అతనితో వచ్చిన అమ్మాయి జారుకుంది. హోటల్ యజమాని, సిబ్బంది అతనిపై లైంగిక దాడి చేసి, అశ్లీల వీడియోలు తీసి, డబ్బులు, ఫోన్ అపహరించారు.
పరీక్షల్లో విఫలమై, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఇతరత్రా కారణాలతో రైతుల కన్నా ఎక్కువగా విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఏడాదికి ఎంత మంది మరణించారో ఇప్పుడు చుద్దాం.
ప్రియుడి మోజులో భర్త చంద్రశేఖర్‌ను హతమార్చింది భార్య భువనేశ్వరి. హత్య చేసి.. తనకు ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫోన్ చేసింది. సందేహాం కలిగి విచారిస్తే.. అసలు నిజం తెలిసింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడగా..ఈరోజు మరణించారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరిపాయని పోలీసులు తెలిపారు.