»Three Jawans Killed In Firing In Kashmir Kulgam Halan
Kashmir: కశ్మీర్లో కాల్పులు ముగ్గురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడగా..ఈరోజు మరణించారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరిపాయని పోలీసులు తెలిపారు.
జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడగా..ఈరోజు మరణించారని పోలీసులు(police) చెప్పారు. శుక్రవారం కుల్గామ్ జిల్లా(kulgam district)లోని హలాన్(halan) అటవీ ప్రాంతంలోని కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కుల్గాం పోలీసులు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఈరోజు మృతి చెందారని అన్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం ఆర్మీ జవాన్లు శోధిస్తున్నారని అధికారులు తెలిపారు.
శ్రీనగర్(srinagar)లోని నాటిపోరా ప్రాంతం నుంచి లష్కరే తోయిబా (LET)కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను జమ్ము కశ్మీర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ శ్రీనగర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్‌లో ఉన్నారని పోలీసులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అయితే నిందితుల నుంచి 3 హ్యాండ్ గ్రెనేడ్లు, 10 పిస్టల్ రౌండ్లు, 25 ఏకే-47 సహా అనేక బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ పోలీసుల బృందం వీరిని అరెస్టు చేసింది. పోలీసుల ప్రకారం అరెస్టయిన ఉగ్రవాదులు ఇమ్రాన్ అహ్మద్ నజర్, బుల్బుల్ బాగ్, బారాముల్లా నివాసి, శ్రీనగర్‌లోని కమర్వారి నివాసి వసీమ్ అహ్మద్ మట్టా, పజల్‌పోరా, బిజ్బెహరా వకీల్ అహ్మద్ భట్.
వకీల్ అహ్మద్ భట్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ జమ్ము అండ్ కశ్మీర్ (ISJK)తో సంబంధం ఉన్న చురుకైన ఉగ్రవాది. బెయిల్‌పై సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే ముందు రెండేళ్లపాటు జైలులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రాథమిక విచారణలో “శ్రీనగర్ నగరంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం” కోసం TRF క్రియాశీల ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని సేకరించినట్లు వారు తెలిపారు.