»Students Commit More Suicides Than Farmers Parliamentary Standing Committee Report
Students: రైతులను మంచి పోయిన విద్యార్థుల సూసైడ్స్..కారణమేంటి?
పరీక్షల్లో విఫలమై, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఇతరత్రా కారణాలతో రైతుల కన్నా ఎక్కువగా విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఏడాదికి ఎంత మంది మరణించారో ఇప్పుడు చుద్దాం.
Students commit more suicides than farmers. Parliamentary Standing Committee Report
Students: దేశంలో(India) చేసిన అప్పులు(Debts) తీర్చే మార్గం లేక, సకాలంలో వర్షాలు పడకా, వచ్చిన పంటకు దిగుబడి రాకా రైతు ఆత్మహత్యలు ప్రతీ సంవత్సరం ఎలా పెరుగుతున్నయో మనం చూస్తునే ఉన్నాము. అదే మాదిరిగా విద్యార్థుల(Students)కు సంబంధించిన ఆత్మహత్యల(suicides) నివేదిక పరిశీలిస్తే మరీ ఆందోళనకరంగా మారిందని తెలుస్తుంది. ఈ మేరకు దేశంలో ప్రతీ ఏడు బలవన్మరణాలు పెరుగుతుండడంపై పార్లమెంటు స్థాయీ సంఘం(Parliamentary Standing Committee) ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా రైతుల కంటే విద్యార్థులే అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
2021లో రైతులు 10,881 మంది ఆత్మహత్య చేసుకుంటే, విద్యార్థులు 13,089 మంది చనిపోయారని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలను జాతీయ సంక్షోభంగా అభివర్ణిస్తున్నప్పటికీ విద్యార్థుల మరణాలు మాత్రం ఎవ్వరి దృష్టినీ ఆకర్షించడం లేదని ఆగ్రహించింది. గత అయిదేళ్లలో ఆత్మహత్యలు 26% పెరిగినట్లు తెలిపింది. 2015-16 నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 10.6 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 2021 ఎన్సీఆర్బీ(NCRB) నివేదిక ప్రకారం ఆ సంఖ్య 12 శాతం మేర పెరిగింది. ఈ నివేదిక ప్రకారం 1,64,033 మంది ఆత్మహత్యకు పాల్పడగా అందులో 1,18,970 మంది పురుషులు, 45,026 మంది మహిళలు ఉన్నారు. బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, నిరుద్యోగుల సంఖ్యే ఉంది. కొవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్ల వల్ల జీవనోపాధులు, ఆదాయం దెబ్బతినడంతో రోజువారీ కూలీల ఆత్మహత్యలు 14%, నిరుద్యోగుల ఆత్మహత్యలు 11% పెరిగాయని వెల్లడించింది.
జీవితంపై ఆశలు, ఆత్మస్థైర్యం కోల్పోవడంతోనే ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారని… వీరిలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ(Students, unemployment) యువత ఉండటం తీవ్ర ఆందోళనకరం అని చెప్పింది. యూపీఎస్సీ, సీఎస్ఈ, నీట్, ఎస్ఎస్సీ, జేఈఈ లాంటి అర్హత పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 24/7 టెలిఫోన్ కౌన్సెలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంచాలిని సూచించింది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. అయితే నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ (NSPS) 2030 నాటికి ఆత్మహత్యలను 10 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదని వివరించింది. అయితే ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలను తెలసుకుంటే వాటిని నివారించడం సులభం అవుతుందని, అందుకోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే మానసిక ఆరోగ్య శిక్షణ తరగతుల ద్వారా ఈ విభాగంలో కార్యాకర్తల సంఖ్యను పెంచాలి. దీర్ఘకాలంలో మెంటల్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్స్ సామర్థ్యాన్ని పెంచాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం శుక్రవారం లోక్సభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.