»Tahsildar House Acb Raids Rs 2 Crore Cash Found Nalgonda
ACB Raids: తహసీల్దార్ ఇంట్లో సోదాలు..రూ.4.75 కోట్ల అక్రమాస్తులు
రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఏకంగా 2 కోట్లకుపైగా పెట్టెల్లో దాచిన క్యాష్ తోపాటు బంగారం కూడా వెలుగులోకి వచ్చింది.
Tahsildar house acb raids Rs 2 crore cash found nalgonda
ఆదాయానికి మంచి పెద్ద ఎత్తున ఆస్తులున్నాయని తెలుసుకున్న ఏసీబీ అధికారులు(acb officers) నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో భారీగా నగదు వెలుగులోకి వచ్చింది. అనేక చోట్ల పెట్టెల్లో క్యాష్ దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు బంగారంతోపాటు పలు రకాల ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.2 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో మహేందర్ అక్రమాస్తులు రూ.4.75 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే తెలంగాణలో ఒక రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు(cash) బయటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక మధ్య స్థాయి అధికారి వద్దనే ఇంత మొత్తంలో క్యాష్ ఉంటే మిగతా వారి దగ్గరే ఏ లెక్కన మనీ ఉంటుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు కేవలం ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో మాత్రం ఇంత భారీగా సంపాదించుకునే అవకాశం లేదని పలువురు అంటున్నారు. ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.