నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు చాలా బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
KCR: నల్గొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల( road accidents)పై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ యాక్సిడెంట్లలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని విచారాం తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
నల్గొండ జిల్లాలోని పెద్దవూరు మండలం నిమ్మనాయక్ తండాకు చెందిన అయిదుగురు కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. ఆదివారం రాత్రి కేశవులు అనే యువకుడు తన బైక్‌తో రోడ్డు మీద నడుస్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. ఆ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబ సభ్యులు సోమవారం తెల్లవారు జామున టాటా ఏస్‌లో ఘటన స్థలానికిి బయలుదేరారు. దారిలో ఓ ట్యాంకర్‌కు టాటా ఎస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.