Delhi:ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారు. ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బ్లాక్ మెయిల్స్‌కి భయపడిన ఓ ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. డబ్బుల కోసం అర్థరాత్రి ఏటీఎం పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఈ ఇద్దరి యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన వీరిద్దరి వయస్సు 14, 15 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రూ.5000 కోసం ఏటీఎంను పగలగొట్టడానికి ప్రయత్నించారని తెలిపారు.
జామియా నగర్లో ఓ దుకాణంలో పనిచేస్తున్న ఇద్దరు మైనర్ యువకులు రాత్రి నడుచుకుని వెళ్తుండగా.. ఐదుగురు దుండగలు వారిపై దాడి చేశారు. మైనర్ యువకులను వివస్త్రను చేసి వీడియో రికార్డు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి యువకులను డబ్బులు అడిగారు. వీడియాను ప్రసారం చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం వల్లే డబ్బులు కోసం ఏటీఎం పగలకొట్టడానికి ప్రయత్నించారని అధికారులకు తెలిపారు. ఏటీఏం కింద డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఏటీఎంను కదిలించిరాట. మైనర్ యువకులను బ్లాక్మెయిల్ చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. మిగిలిన నలుగురిని గుర్తించలేకపోయారు. పిల్లలపై లైంగిక నేరాలు చేసినందుకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ మైనర్ యువకులు దొంగతనం చేసినందుకు వీరిపై దొంగతనం కేసు ఇంకా ఉందని తెలిపారు.