Landslide that fell on the car For tourist people died uttarakhand
ఉత్తరాఖండ్(uttarakhand)లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ప్రయాణిస్తున్న కారుపై ఆకస్మాత్తుగా కొండచరియలు(landslides) విరిగిపడ్డాయి. దీంతో కారు శిథిలాల కింద నలిగిపోవడంతో గుజరాత్‌కు చెందిన ముగ్గురు యాత్రికులు(pilgrims) సహా ఐదుగురు మరణించారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే సమాచారం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోయింది. కేదార్నాథ్(kedarnath)కు వెళ్లే మార్గంలో ఫాటా ప్రాంతంలోని తర్సాలి వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన జరిగింది. మరోవైపు గుప్తకాశీ-గౌరీకుండ్ హైవేపై ఫాటా సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో 60 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. అయితే ఎడతెరిపిలేని వర్షం పనికి ఆటంకం కలిగించిందని పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం వాతావరణం తేటతెల్లం కాగానే కారు అవశేషాల నుంచి ఐదు మృతదేహాలను బయటకు తీసినట్లు వారు తెలిపారు. ధ్వంసమైన రహదారి మరమ్మతులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
VIDEO | Five people, including three pilgrims from Gujarat, died yesterday after being buried under the debris of a landslide on the Kedarnath Yatra route in Uttarakhand's Rudraprayag.