»Father Ties Daughter Behind Bike And Drags Her To Railway Lines In Alleged Honor Killing Incident In Punjab
Punjab: పరువు హత్య కలకలం..కూతుర్ని చంపి బైక్‌తో ఈడ్చుకెళ్లిన కన్నతండ్రి
పంజాబ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఓ తండ్రి తన కూతుర్ని చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానవత్వం మంటగలిసింది. పంజాబ్(Punjab)లో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా సమాజంలో ఇంకా మార్పు రావడం లేదు. ఎక్కడో ఒక చోట పరువు హత్య కలకలం రేపుతూనే ఉంది. తాజాగా బిడ్డ పట్ట కన్నతండ్రి వ్యవహరించిన తీరు అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఓ కూతురు ఇంట్లో చెప్పకుండా యువకుడితో వెళ్లిపోయింది. అయితే మరుసటి రోజు ఆ యువతి ఇంటికి తిరిగి రాగా ఆ తండ్రి కన్నకూతుర్ని చంపేశాడు.
కూతురి మృతదేహాన్ని బైక్‌తో ఈడ్చుకెళ్తున్న వీడియో:
CCTV footage captures an honor killing incident where a father can be seen dragging his daughter, tying her to his motorcycle. Later, her dead body was found near railway lines. The girl had escaped from home with a guy. https://t.co/ltQx2Bzle5pic.twitter.com/3XkJVARzAc
కూతుర్ని హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని తన బైక్‌కు కట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన అమృత్సర్ లోని ముచ్చల్ (Muchal) గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు కథనం మేరకు..ముచ్చల్ గ్రామానికి చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులకు చెప్పకుండా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఆమె ఇంటకి తిరిగి రాగా ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తమ అభిప్రాయానికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆ యువతిని కన్నతండ్రే హత్య చేశాడు. చంపిన తర్వాత ద్విచక్ర వాహనానికి ఆమె కాలును తాడుతో కట్టేసి గ్రామంలోని వీధిలో ఈడ్చుకెళ్లాడు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి చేతులు దులుపుకున్నాడు. అయితే ఆ కసాయి తండ్రి తన కూతురు మృతదేహాన్ని బైక్‌తో ఈడ్చుకెళ్లిన ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణను ముమ్మరం చేశారు.