»Twitter Shocked Them 23 Lakh Accounts Blocked In India
Twitter: వారికి షాకిచ్చిన ట్విటర్.. భారత్‌లో 23 లక్షల అకౌంట్స్ బ్లాక్
భారత్‌లోని 23 లక్షల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది. చిన్నారులపై లైంగిక దాడి, అశ్లీలత, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది.
నిబంధనలను ఉల్లింఘించిన వారిపై ట్విట్టర్ (Twitter) ఉక్కుపాదం మోపుతోంది. చాలా మంది హ్యాండిల్స్‌ను బ్లాక్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జూన్ నుంచి జూలై వరకూ రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించే పోస్టులు చేసిన వారి ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపింది. అంతకుముందు మే 26 నుంచి జూన్ 25 వరకూ కూడా నెల రోజుల వ్యవధిలో 5,44,473 ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది.
ఇవేకాకుండా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న మరో 1,772 అకౌంట్లను నిషేధించినట్లుగా ట్విట్టర్ (Twitter) వెల్లడించింది. గత ఏడాది కూడా ఇదే టైంలోనే 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న 2,865 అకౌంట్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. భారత్ తీసుకొచ్చిన నూతన ఐటీ చట్టాల ప్రకారంగా అనైతిక చర్యలకు పాల్పడే వారి అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ వస్తోంది.