»Seven People Died In Flood At Himachal Pradesh Rain
Floods: హిమాచల్ ప్రదేశ్లో వరదలు..16 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో మళ్లీ ఆదివారం రాత్రి వానలు దంచికొట్టాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 16 మంది మృత్యువాత చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.
Seven people died in flood at Himachal Pradesh rain
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో మరోసారి వర్షం విధ్వంసం సృష్టించింది. రాష్ట్రంలోని సోలన్లో ఉన్న మామ్లిక్లోని ధయావాలా గ్రామం సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాల వరదలొచ్చాయి. దీంతో 16 మంది మరణించగా(Seven people died)..మరో ఆరుగురిని అక్కడి సిబ్బంది రక్షించారు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. దీంతో ఆ గ్రామం మొత్తం వరదల విధ్వంసానికి గురైంది. ఈ ఘటనలో రెండు ఇళ్లు, ఒక గోశాల కూడా కొట్టుకుపోయాయి. అయితే భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో పాఠశాలలు, కాలేజీలను అధికారులు మూసి వేశారు. చాలా చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. హిమాచల్ పర్వతాలపై కొండచరియలు విరిగిపడటం నిరంతరం జరుగుతోంది. మరోవైపు ఆగస్టు 14న పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం ప్రతిపాదిత పరీక్షలను కూడా వాయిదా వేసింది.
భారీ వర్షాల(rains)కు కొండచరియలు విరిగిపడటంతో కుల్లి మనాలికి వెళ్లే రహదారులు మూసుకుపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారి నుంచి పండోహ్ వరకు చాలా చోట్ల రోడ్లు కూడా మూసివేయబడ్డాయి. పర్యాటకులు, స్థానిక ప్రజలకు డీజీపీ సంజయ్ కుందూ ఒక సలహా జారీ చేశారు. దీంతో పాటు నదీ కాలువలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. సిమ్లా, చండీగఢ్లను కలిపే సిమ్లా-కల్కా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో కోటి సమీపంలోని చక్కి మోర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పాటు మండి జిల్లాలో చాలా చోట్ల ఇళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు.