వరుస సెలవుల నేపథ్యంలో నగరాల నుంచి పల్లెటూర్లకు ఉద్యోగులు బ్యాగులు సర్దుకున్నారు. అనేక మంది ప్రయాణించడం వల్ల హైవేల(Highway)పై వాహనాల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad) నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి సమీపంలో నాలుగు వాహనాలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం (Accident)లో మూడు కార్లు ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో:
పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్(hyderabad) నుంచి విజయవాడ (Vijayawada)కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) బస్సు వెళ్తోంది. ఆ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొంది. దీంతో ఆ కారు దానికి ముందుండే మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ వరుస ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.
ప్రమాద తీవ్రత వల్ల ఒక కారులోని ఇంజిన్ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. మంచి విషయం ఏంటంటే ఈ ప్రమాదాల్లో కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.