Thefts: చార్మినార్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడి
చార్మినార్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 1.20 గంటల నుంచి 1.50 గంటల సమయంలో దోపిడికి తెగబడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
Thefts: చార్మినార్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓకే రోజు రెండు రైళ్లలో (trains) చోరీ చేశారు. సింగరాయకొండ- కావలి రైల్వే రూట్లో దోపిడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు ఎస్ 2, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7, ఎస్ 8 బోగీల్లో చోరీ జరిగింది. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడి జరిగింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఎస్ 1, ఎస్ 2 బోగీల్లో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి 1.20 గంటల నుంచి 1.50 గంటల మధ్య దోపిడి జరిగినట్టు తెలుస్తోంది. దోపిడీకి సంబంధించి తెట్టు, కావాలి పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపై రాళ్ల దాడి చేసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.
ట్రైన్ జర్నీ చేసే సమయంలో ప్రయాణికులు (passengers) అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అలర్ట్‌గా ఉండాలి. దోపిడీ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తే.. అన్నీ బోగీల్లో ఉన్న వారు అప్రమత్తంగా లేకపోవడంతో దొంగలకు అది అలుసుగా మారుతుంది. ఇదే విషయాన్ని రైల్వే ఉద్యోగులు చెబుతున్నారు. దొంగలు వస్తేనే ఎదుర్కొవాలని.. లేదంటే చైన్ (chain) లాగి అందరూ ముకుమ్మడిగా ఉండాలని వారు సూచిస్తున్నారు. దోపిడీ జరుగుతున్న.. తమకేం కావడం లేదని అనుకుంటే, దొంగలు ఇలానే రెచ్చిపోతారని చెబుతున్నారు. గతంలో కూడా ఇలా జరగడం వల్లే.. రైళ్లలో దొంగతనాలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు.
ఏసీ బోగీల్లో సెక్యూరిటీ
రైలులో జనరల్ బోగీల్లో (general) అందరూ ఎక్కుతుంటారు. అక్కడ దొంగతనాలకు అంతగా ఆస్కారం ఉండదు. స్లీపర్ క్లాస్‌లో ఎవరి బెర్త్ వారికి ఉంటుంది. మిగతా వారు ఆ బెర్త్‌లలో ఎక్కేందుకు ఆస్కారం ఉంటుంది. ట్రైన్ సిగ్నల్ క్రాసింగ్, మిగతా సమయంలో చైన్ లాగితే చాలు.. హిజ్రాలు వస్తుంటారు. అలానే కొందరు దొంగలు వచ్చి, అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో టీసీ వస్తే ఓకే… లేదంటే దొంగలను అడిగే వారు ఉండరు. కొన్ని సమయాల్లో అర్ధరాత్రే కాదు.. మధ్యాహ్న వేళల్లో కూడా చోరీ జరిగిన సందర్భాలను చూశాం. ఏసీ-3 టైర్ నుంచి ఏసీ-2, ఏసీ-ఫస్ట్ క్లాస్‌లో సెక్యూరిటీ ఉంటుంది. ఏసీ-3 టైర్ విభాగంలోకి రావాలంటే.. టికెట్ చూపించాలి.. లేదంటే లోపలికి అనుమతి ఇవ్వరు. ఇందులోకి దొంగలే కాదు.. హిజ్రాలు కూడా రావడానికి వీలుండదు. అందుకే కొందరు ఏసీ-3 టైర్ టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తుంటారు. వారికి దొంగల బెడద ఉండదు.