»Triangle Love Visakha Gopalapatnam Police Station Area Inter Girl Suicide
Triangle love: ఎవరితో ఉండాలో తెలియక ఇంటర్ యువతి మృతి
ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్‌లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Triangle love visakha gopalapatnam police station area Inter girl suicide
ఏపీ వైజాగ్(visakhapatnam)లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ట్రయాంగిల్ లవ్(triangle love) స్టోరీ కారణంగా ఓ యువతి(16) ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన యువతి నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆ యువతి ఆదర్శనగర్‌కు చెందిన సూర్యప్రకాష్‌రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ..ఇందిరానగర్‌కు చెందిన లెంకా సాయికుమార్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె సూర్యప్రకాష్‌తో చనువుగా ఉండడంతో సాయికుమార్‌కు నచ్చలేదు. అలాగే సాయికుమార్‌తో చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్‌కు నచ్చలేదు. దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి సూర్య ప్రకాశ్, సాయి కుమార్ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే బాలిక(girl)ను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద ఆగస్టు 12న రైలు కింద పడి మృతి చెందాడు. ఆగస్టు 13న ఉదయం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు(parents) సూర్యప్రకాష్‌గా గుర్తించారు. మరోవైపు లంకా సాయికుమార్‌ను పోలీసులు(police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.