Hakimpet Sports School: లైంగిక వేధింపులు..మంత్రి చర్యలు
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దీంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు.
ఇటివల హైదరాబాద్‌లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే మరోకటి వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్న మైనర్ విద్యార్థులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అధికారి విద్యార్థినులను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని పలు ప్రాంతాలకు తిప్పేవాడని బాలికలు చెబుతున్నారు. అంతేకాదు గేమ్స్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడేవారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోయారు. అయితే అతనికి పలువురు నేతలు, అధికారుల సపోర్ట్ ఉందని బాలికలు అంటున్నారు.
ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని తెలిపారు. అయితే వేధింపులపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కె.కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై ఒక అధికారి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే కథనంపై కవిత స్పందించారు. ఆ అధికారి చేసిన అటువంటి క్రూరమైన నేరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆమె అన్నారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్‌ను ఆమె కోరారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని మంత్రిని అభ్యర్థించారు.
ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.
బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం…