»Shock For Brij Bhushan Case Registered With Strong Evidence
Brij Bhushan: బ్రిజ్ భూషణ్‌కు షాక్..బలమైన సాక్ష్యాలుండటంతో కేసు నమోదు
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల కేసులో ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం ఉందని, ఆ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఉన్న ఆధారాలు కేసుకు సరిపోతాయని ప్రభుత్వ న్యాయవాది(Public prosecutor) అతుల్ కుమార్ శ్రీవాత్సవ ద్వారా పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీంతో బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదైంది. అయితే ఆయనకు ఎలాంటి శిక్ష పడుతుందనేది త్వరలోనే తెలియనుంది.
గత రెండు రోజుల క్రితం బ్రిజ్ భూషణ్ (Brij Bhushan Sharan Singh) లాయర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి లైంగిక వాంఛ లేకుండా ఓ క్రీడాకారిణిని కౌగిలించుకోవడం లైంగిక వేధింపుల కిందకు రాదని బ్రిజ్ భూషణ్ లాయర్ వాదించారు. దీంతో శ్రీవాత్సవ(Atul Kumar Srivastava) మాట్లాడుతూ..ఏ ఉద్దేశంతో బ్రిజ్ భూషణ్ సదరు అమ్మాయిని హత్తుకున్నాడనేది చెప్పాలని కోర్టుకు తెలిపాడు.
మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. వినేశ్ ఫోగట్ నేతృత్వంలో భజ్ రంగ్ పూనియా, సాక్షి మాలిక్ వంటి మల్ల యోధులు నెల రోజుల పాటు పోరాటాలు చేశారు. దేశ వ్యాప్తంగా రెజ్లర్లకు మద్దతు లభించింది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో పోలీసులు బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో కోర్టు బ్రిజ్ భూషణ్ కు శిక్షను విధించే అవకాశం ఉంది.