»A Car Hit The Footpath In Mangalore Karnataka One Person Died Video Goes Viral
Viral video: ఫుట్ పాత్ పై దూసుకొచ్చిన కారు..ఒకరు మృతి
ప్రమాదం ఎటు నుంచైనా పోంచి ఉండోచ్చు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతాయి. ఫుట్ పాత్‌పై నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తులపై కూడా కారు దూసుకెళ్లింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
A car hit the footpath in Mangalore, Karnataka.. One person died.. Video goes viral
Viral video: ప్రమాదం చెప్పి రాదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఫుట్ పాత్‌పై నడవాలని చిన్నప్పటి నుంచి గురువులు, శ్రేయేభిలాషులు చెబుతుంటారు. దాన్ని పాటిస్తూ మనం సరైనదారిలోనే వెళ్తున్నామని జాలీగా నడుస్తుంటాము. కానీ తాజా ప్రమాదాలను పరిశీలిస్తే మనం కరెక్ట్‌గా ఉంటే చాలదు. ఎదుటివారు కూడా సరైనా మార్గంలో వస్తున్నారా లేదా అనేది గమనించుకోవాలనిపిస్తుంది. ఇటివల సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారిన వీడియో చూస్తే వాహనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. ఫుట్ పాత్(Footpath)పై నడుచుకుంటు వెళ్తున్న నలుగురి వ్యక్తులపై ఓ కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా..నలుగురిని ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉంది. ఈ ఘటన కర్ణాటక(Karnataka)లోని మంగళూరు(Mangalur)లో బుధవారం జరిగింది.
వీడియోలో చూస్తే మంగళూరు పట్టణంలోని డివైడర్ తో కూడిన రోడ్డు. పక్కనే విశాలమైన ఫుట్ పాత్ కూడా ఉంది. దానిపై నలుగురు యువతులు నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి ఒక కారు వేగంగా వచ్చి వారిపై నుంచి దూసుకుపోయింది. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. సౌండ్ వస్తుందని వెనుకకు తిరిగే లోపే వారిని కారు ఢీ కొట్టింది. దాంతో వారు ఎగిరిపడ్డారు. వారి మీదనుంచే కారు వెళ్లింది. ఆ క్రమంలో ఎదురుగా ఉన్న మరో మహిళను ఢీకొట్టింది. కారు ఎక్కడా ఆగకుండా అదే వేగంతో రోడ్డెక్కింది. అక్కడున్న ఇతర పాదచారులు నివ్వరపోయి చూశారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) ఎక్స్‌లో షేర్ చేశారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలని సూచన చేశారు. మితి మీరిన వేగం, అజాగ్రత్తే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇలాంటి ఘోర ప్రమాాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడతాయని సజ్జనార్ ప్రజలకు సూచించారు.
మితిమీరిన అతివేగం, ఆజాగ్రత్తే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణం. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయి.
కర్ణాటకలోని మంగళూరులో నిన్న జరిగిందీ ఘోర రోడ్డు ప్రమాదం. ఈ యాక్సిడెంట్ లో ఒక మహిళ… pic.twitter.com/kiVTJtDIul