మంగళవారం రాత్రి సిక్కిం(sikkim)లో భారీ వర్షం కారణంగా లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. దీంతో ఆ ప్రాంతంలోని అనేక వాహనాలు కొట్టుకుపోగా..వాటిలో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు.
ఇటలీలోని వెనిస్(venice) నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా కింద పడటంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది మృత్యువాత చెందారు. మరో 18 మంది గాయపడ్డారు.
ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో దగ్గర్లోని పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. తీరా చూస్తే ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలో శవాలైకనిపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.
చర్చి పైకప్పు కూలిపోవడంతో 10 మంది దుర్మరణం చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 60 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరో 30 మంది ఉండటంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
పిల్లల నుంచి పెద్దల వరకు చేతులో మొబైల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు తీసుకుంటారు లేదా రీల్స్ చేస్తుంటారు. అదేదో ఉల్లాసంగా చేస్తే బాగుంటుంది. కానీ ఉద్యమంలా చేస్తారు కొందరు. అలా రీల్స్ కోసం మరికొందరు దారుణమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా మరొకటి చోటుచేసుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబర్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఆ దందా ద్వారా సుమారు రూ.350 కోట్ల బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
బర్త్ డే పార్టీలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 40 ఫైర్ ఇంజిన్లు, 12 ఎమెర్జెన్సీ వాహనాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.
వర్షం కారణంగా పెద్ద ఎత్తున వచ్చిన వరదతో ఓ నాలా ఉప్పొంగింది. ఆ క్రమంలో అటుగా వెళ్లిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.