»Crackers Shop Fire Accident At Rajendra Nagar Hyderabad
Fire accident: క్రాకర్స్ దుకాణంలో చెలరేగిన మంటలు..షాపులు దగ్ధం
టాపాసుల దుకాణంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో అవి కాస్తా పక్కన ఉన్న ఫుడ్ జోన్ కు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోగా..ఆ మంటలు మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. అయితే
crackers shop fire accident at rajendra nagar hyderabad
హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో(rajendra nagar) అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. సన్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణం(crackers shop)లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా పక్కన ఉన్న దుర్గా భవాని ఫుడ్ జోన్ కు వ్యాపించాయి. ఆ క్రమంలోనే అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో చెలరేగిన మంటలు కాస్తా మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. ఆ నేపథ్యంలోనే మొత్తం నాలుగు దుకాణాల నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలోనే పలువురు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. అర్ధరాత్రి వేళ ఏం జరిగిందోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ప్రమాద సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరుగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.