»Road Accident On Gorakhpur Kushinagar Highway Six People Dead And 27 Injured
Accident: హైవేపై ఘోర ప్రమాదం..ఆరుగురు మృతి, 27 మందికి గాయాలు
అర్ధరాత్రి రోడ్డు పక్కన నిలిపిన రెండు ప్రయాణికుల బస్సులను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత చెందగా...మరో 27 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Road accident on Gorakhpur Kushinagar highway six people dead and 27 injured
గోరఖ్‌పూర్-ఖుషీనగర్ హైవేపై(Gorakhpur Kushinagar highway) గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. జగదీష్పూర్ సమీపంలో గురువారం అర్థరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు రెండు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 27 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఐదు అంబులెన్స్‌ల సాయంతో జిల్లా ఆస్పత్రికి, వైద్య కళాశాలకు తరలించారు.
As many as six people were #killed and 25 others sustained injuries after a speeding truck collided with a bus parked near Jagdishpur on the Gorakhpur-Kushinagar Highway in the Gorakhpur district of #UttarPradesh on November 9 night. pic.twitter.com/T0UYYXTDjO
గాయపడిన కొందరి ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు(doctors) తెలిపారు. రోగులకు సంబంధించి సదర్ ఆసుపత్రి, వైద్య కళాశాల వైద్యులతోనూ అధికారులు మాట్లాడారు. దీని తరువాత మరింత మంది వైద్యులను కూడా అక్కడికి పిలిపించారు. మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ నుంచి కాంట్రాక్ట్ బస్సు ప్రయాణికులతో పరౌనా వైపు వెళ్తోంది. జగదీష్పూర్లోని మల్లాపూర్ సమీపంలో బస్సు టైర్ పంక్చర్ అయింది. ఆ క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. కండక్టర్ మరో బస్సుకు ఫోన్ చేశాడు.
మృతుల్లో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు. గుర్తించిన వారిలో నంద్లాల్ పటేల్ కుమారుడు శైలేష్ పటేల్ (25), తుర్కపట్టి, ఖుషీనగర్లో నివాసముంటున్న జవహీర్ చౌహాన్ కుమారుడు సురేష్ చౌహాన్ (35), మదర్హా, హత కుషినగర్‌లో నివాసముంటున్న అశోక్ సింగ్ కుమారుడు నితేష్ సింగ్ (25), హిమాన్షు యాదవ్ కుమారుడు హిమాన్షు యాదవ్ ఉన్నారు. బన్సారీ యాదవ్ (24) నివాసి మిస్రిపట్టి పదరౌనా, ఖుషీనగర్లో ఉన్నారు.