ఎన్సీబీ ఇవాళ సుమారు 2400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది.
కారు, ట్రక్కు ఢీ కొన్న ప్రమాదం(accident)లో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సాగర్ జిల్లాలో జరిగింది.
హైదరాబాద్ ORRపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, బొలెరో వాహనాన్ని ఓ లారీ వచ్చి ఆకస్మాత్తుగా ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘర్షణలో టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ కారు ధ్వంసం అయింది.
బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకం సృష్టించారు. అదే పార్టీకి చెందిన కార్యకర్తతోపాటు అతని ఫ్యామిలీపై దాడి చేశారు. ఆ క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
రాజాం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి(government teacher) హత్య(murder) కేసులో విజయనగరం పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలను జిల్లా ఎస్పీ దీపిక వెల్లడించారు.
కన్వర్ యాత్ర విషాద యాత్రగా మారింది. విద్యుత్ షాక్‌తో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్లో ఓ యువతి ఫేస్ బుక్లో మరో అబ్బాయిని బురిడీ కొట్టించింది. ఆ క్రమంలో అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయలు చీట్ చేసి తీసుకుని తిరిగి ఇవ్వకపోగా..అతన్నేరౌడీలతో కొట్టిస్తానని బెదిరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కులో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన కంపార్ట్‌మెంట్ ఉంది. అయితే ఇప్పుడు అది బట్టబయలు కావడంతోపాటు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయి కూడా దోరికిపోయింది. అది ఎక్కడో ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఉరుమురు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. తాజాగా 24 గంటల్లో పిడుగులు పడి 18 మంది మృతిచెందారు. ఈ దారుణ ఘటనలు బీహార్‌లో చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ శామీర్ పేటలో కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపిన ఏపీకి చెందిన మనోజ్ నాయుడు. పెల్లెట్స్ నుంచి స్వల్ప గాయాలతో సిద్ధార్థ్ దాస్ తప్పించుకున్నారు. అయితే సిద్ధార్థ్ భార్య శ్వేత సెలబ్రిటీ క్లబ్ లో మనోజ్ తో గత మూడేళ్లుగా సహజీవనం చేస్తుంది. 2019లో సిద్ధార్థ్ దాస్ తో విడిపోయిన శ్వేత మనోజ్ తో ఉంటుంది. ఆ క్రమంలో సిద్ధార్థ్ కుమార్తె, అబ్బాయి ఆమెతోనే ఉంటున్నారు. అయితే ఆ చిన్...
తక్కువ జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాని లేఖ రాసి మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్యహత్య చేసుకుంది. మరోవైపు తెలంగాణలో అనేక మంది పంచాయితీ ఉద్యోగులు జీతాలు సరిగా ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
వరుస రైలు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనను గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు ఇంజిన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
కొందరు మహిళలల్లో నేర ప్రవృతి పెరుగుతోంది. భర్తలు ఒక మాట అంటే పడటం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ మహిళా అయితే ఏకంగా భర్తపై దాడి చేసి హతమార్చింది.