»The Daughter Who Fell In The Pond The Mother Who Tried To Save Them Both Died
Nagarkurnool: చెరువులో పడిపోయిన కూతురు.. కాపాడడానికి వెళ్లిన తల్లి ఇద్దరూ మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ తల్లి బిడ్డలని తెలిసింది.
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ తల్లి బిడ్డలని తెలిసింది. తల్లీ కూతురు ఇద్దరూ బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. తల్లి బట్టలు ఉతుకుతున్న క్రమంలోనే కూతురు ఒక్కసారిగా కాలుజారి చెరువులో పడింది. దీంతో తల్లి చుట్టుపక్కల చూసింది. కానీ ఎవరూ సాహించడానికి ముందుకు రాలేదు. దీంతో కూతురును కాపాడుకునేందుకు అని వెళ్లి తల్లి కూడా చనిపోయింది.
ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం నాగ్నూల్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన నారమ్మ(62), ఆమె కూతురు సైదమ్మ(42) బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. పాపను కాపాడే క్రమంలో నారమ్మ కూడా నీటిలో మునిగిపోయింది. శనివారం రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు చేపల వేటతో మరో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.