»Negligence Of The Authorities A Five Year Old Boy Died After Falling Into The Nala Vijayawada
Falling nala: అధికారుల నిర్లక్ష్యం..నాలాలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
అధికారుల నిర్లక్ష్యం కాస్తా ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. అవును ఈ ఘటన ఏపీలో విజయవాడలో జరిగింది. అయితే అసలు ఏం జరిగింది? ఎలా బాలుడు మృత్యువాత చెందాడనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
Negligence of the authorities a five-year old boy died after falling into the nala vijayawada
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఐదేళ్ల చిన్నారి మృత్యువాత చెందాడు. అవును ఈ ఘటన ఏపీలోని విజయవాడ(vijayawada) నగరపాలక సంస్థ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం. విజయవాడలోని నాలాలపై పలు చోట్ల మెష్ లు ఏర్పాటు చేయలేదు. ఆ క్రమంలోనే ఓ బాలుడు అండుకుంటూ అటువైపుగా వెళ్లి నాలాలో పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ఆ చిన్నారిని ఎవరూ కూడా కాపాడలేకపోయారు. దీంతో బాలుడు నాలాలోనే ప్రాణాలు విడిచాడు.
విజయవాడ 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటలో ఇది జరిగింది. అష్రఫ్ అనే ఐదేళ్ల బాలుడు(children) బుధవారం ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కనే ఉన్న పెద్ద నాలాలో పడి మరణించాడు. అయితే ఇది తెలియని బాలుని తల్లిదండ్రులు అతని ఆచూకీ కోసం చాలా సమయం వెతికారు. అయినా కూడా చిన్నారి జాడ లభించలేదు. ఆ క్రమంలో రాత్రి 10 గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ నేపథ్యంలోనే బాలుని ఇంటి ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ క్రమంలో పోలీసులకు(police) అనుమానం వచ్చి ఇంటి పక్కనే ఉన్న నాలాలో ఈరోజు వెతికించారు. దీంతో ఇంటికి సమీపంలో కొద్దిదూరంలో నాలాలో బాలుడి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుని మృతి నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.