»Tragedy Six Youths Died After Drinking Adulterated Liquor
Haryana: విషాదం..కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతి
కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతిచెందారు. హర్యానాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, పలువురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
కల్తీ మద్యం తాగి ఆరుగురు యువకులు మృతిచెందిన సంఘటన హర్యానా (Haryana) రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యమునా నగర్ (Yamuna Nagar) జిల్లాలో విషాదాన్ని నింపింది. మందేబరి గ్రామంలో ఆరుగురు యువకులు మద్యం సేవించారు. తాగిన కొంతసేపటికి వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతిచెందారు.
#WATCH | Yamuna Nagar, Haryana: 6 people died after allegedly consuming spurious liquor in Haryana's Yamunanagar SP Ganga Ram Punia says, "In the afternoon, we received the information that a youth had died after consuming alcohol. After this information, the team reached there… pic.twitter.com/sPMMxl8cOF
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు కారణమైన పలువురు నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. గుర్తించిన వారిలో కొందరిని అరెస్ట్ చేసినట్లు యమునా నగర్ జిల్లా ఎస్పీ గంగారామ్ పునియా (SP Ganga Ram Punia) వెల్లడించారు. కాగా మద్యం సేవించిన వారిలో ఐదుగురు తమ గ్రామంలోనే చనిపోయారని, మరొకరు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించినట్లు యమునా నగర్ ఎస్పీ (Yamuna Nagar SP) వెల్లడించారు. ఆరుగురు యువకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అప్పటి వరకూ బాగానే ఉన్న యువకులు మరణించడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు.