చెత్త కుప్పలో వందల వేల లక్షలు కాకపోయినా కోట్లాది రూపాయలు దొరికితే... ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తాం. కానీ, బెంగళూరులో చెత్త సేకరించే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
rs25 crore found in garbage heap bengaluru karnataka
అసాధారణమైన రితీలో చెత్త కుప్ప(garbage heap)లో చెత్త ఎరుకునే వ్యక్తికి రూ.25 కోట్ల విలువైన నోట్ల కట్టలు దొరిగాయి. అవును మీరు విన్నది నిజమే. ఆ కరెన్సీ నోట్ల కట్టలను చూసి అతను అవాక్కయ్యాడు. అయితే అది మన కరెన్సీ కాదు. నవంబర్ 1న బెంగళూరు(bengaluru) శివారులో సల్మాన్ షేక్ (39) అనే వ్యక్తి చెత్త ఏరుతుండగా పేపర్లో చుట్టి ఉన్న 23 అమెరికన్ డాలర్ల కట్టలు కనిపించాయి. దీంతో ఆశ్చర్యపోయిన అతడు కరెన్సీ కట్టలను ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచాడు.
తర్వాత అతని యజమాని తౌహిదౌల్ ఇస్లాం అలియాస్ బప్పాకు అప్పగించాడు. స్వరాజ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త కలీముల్లాకు బప్పా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని వారిద్దరూ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందను కలిసి తెలిపారు. దీనిపై స్పందించిన సీపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని హెబ్బాళ్ పోలీసులను(police) ఆదేశించారు. అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం విలువ రూ. 25 కోట్లుగా తేల్చారు.
కరెన్సీపై కొన్ని రకాల రసాయనాలు పూసినట్లు గుర్తించారు. నల్లడాలర్ కుంభకోణానికి(black dollar scam) పాల్పడిన ముఠా ఈ కరెన్సీ నోట్లను చెత్తకుప్పల్లో పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఇవి నకిలీవా? అసలు డాలర్లు? వారిని గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, నవంబర్ 7 తెల్లవారుజామున ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు హెబ్బాల్లోని బెతెల్ ఏజీ చర్చి సమీపంలోని బప్పా నివాసానికి వచ్చి కరెన్సీ అడిగారని కలీముల్లా చెప్పారు.
‘ఐదుగురు వ్యక్తులు బప్పా ఇంటికి వచ్చారు. వారిలో ఇద్దరు ప్రవేశించి అమెరికన్ కరెన్సీ గురించి అడిగారు. పోలీసులకు అప్పగించినట్లు బప్పా చెప్పినా నమ్మలేదు. ఎర్రటి సూట్కేస్, ల్యాప్టాప్, డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)తో పాటు ఇన్నోవాలో అతడిని తీసుకెళ్లారని కలీముల్లా అన్నారు. బయట ఉన్న ముగ్గురు బాప్పా స్నేహితుడిని వెనుక తుపాకీ పెట్టి బెదిరించినట్లు సమాచారం. వారు కన్నడలో మాట్లాడుకున్నారని, హిందీలో కరెన్సీ గురించి అడిగారని బప్పా వివరించారు. తరువాత, బప్పాను ఉదయం 9.30 గంటలకు మాన్యతా టెక్ పార్క్ వద్ద దింపారు.