Karnataka: దారుణం.. కొడుకు చేసిన తప్పుకు తల్లికి శిక్ష.. నగ్నంగా ఊరేగించి
కొడుకు మీద ఉన్న కక్షతో తల్లిపై కిరాతకంగా ప్రవర్తించిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కొడుకు ప్రేమించాడని తల్లిని వివస్త్రను చేసి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
Karnataka: కర్ణాటకలో దారుణం ఘటన జరిగింది. కొడుకు మీద ఉన్న కక్షతో తల్లిపై కిరాతకంగా ప్రవర్తించారు. బెళగావి జిల్లాలో న్యూవంటమూరి గ్రామానికి చెందిన ప్రియాంక, అశోక్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రియాంకకు వేరే వ్యక్తితో వివాహం చేయడానికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. దీంతో అశోక్, ప్రియాంక ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. అశోక్ ఇంటిని ధ్వంసం చేసి యువకుడి తల్లిపై కర్కశంగా ప్రవర్తించారు.
యువకుడి తల్లిని వీధిలోకి ఈడ్చుకొచ్చి దాడి చేశారు. వివస్త్రను చేసి ఊరేగించారు. తర్వాత కరెంటు స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. గ్రామస్తులు ఎవరూ కూడా అడ్డుకోలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏడుగురిలో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇది చాలా దారుణమైన ఘటన. అత్యంత అమానుషం.. నిందితులను అరెస్ట్ చేశాం. చట్ట ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.