అమెరికాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన భారత సంతతి ఫ్యామిలీ హత్యకు గురికావడంతో…అక్కడి భారతీయుల్లో భయాందోళన మొదలైంది. 8 నెలల చిన్నారితోపాటు నలుగురు హత్యకు గురయ్యారు. ట్రక్కుల బిజినెస్ నిర్వహించే వీరిని ఓ దుండగుడు తూపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న అమెరికా పోలీసులు వారి గురించి ఆరా తీయగా..బుధవారం రాత్రి ఓ తోటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
దీంతో వారి స్వగ్రామామైన పంజాబ్‌లోని హర్షిపిండ్లో విషాదం నెలకొంది. వీరి మృతి పట్ల పంజాబ్ సీఎం, కేంద్ర మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే వారి భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.